Tv424x7
Andhrapradesh

ఈ ఆందోళనల వెనుక అసలు కారణం…. అతడేనా..?

నేపాల్‌లో కొనసాగుతున్న భారీ నిరసనలపై కొత్త విషయాలు బయటపడ్డాయి.

Hami Nepal అనే ఎన్‌జీఓ ప్రెసిడెంట్ సుడాన్ గురుంగ్ ఈ ఆందోళనలకు ప్రధాన ప్రేరకుడిగా అంతర్జాతీయ మీడియా రిపోర్ట్ చేసింది.

2015 భూకంపం తర్వాత స్థాపించబడిన ఈ ఎన్‌జీఓకి అమెరికా కంపెనీలు సహా అనేక బ్రాండ్ల నుంచి పెద్ద ఎత్తున ఫండింగ్ వచ్చినట్లు సమాచారం.

సెప్టెంబర్ 8న సోషల్ మీడియా బ్యాన్ అమలులోకి రాకముందే నిరసన ఎలా చేయాలో చెబుతూ ఆయన వీడియో రిలీజ్ చేశారు.

దీంతో ప్రభుత్వ మార్పు వెనుక US మద్దతు ఉందా? అన్న ఆరోపణలు వెలువడుతున్నాయి.

అయితే, నిపుణులు మాత్రం ఆందోళనల అసలు కారణాలు అవినీతి, నిరుద్యోగం, రాజకీయ వారసత్వం, సోషల్ మీడియా స్వేచ్ఛ కట్టడి అని చెబుతున్నారు.

సుడాన్ గురుంగ్ కేవలం “ముఖం” మాత్రమేనని, మొత్తం కారణం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అనూష

Related posts

విశాఖలో జగన్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి

TV4-24X7 News

నేడు చింతపల్లిలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన.8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ

TV4-24X7 News

నోబెల్ గ్రహీత ప్రొ. మైఖేల్ క్రెమెర్‌తో సీఎం చంద్రబాబు భేటీ

TV4-24X7 News

Leave a Comment