ధూమపానం కేవలం వ్యక్తి ఆరోగ్యాన్నే కాదు, అతని కుటుంబ ఆనందాన్ని కూడా నాశనం చేస్తుందని ఈ చిత్రం గాఢంగా తెలియజేస్తోంది.
సిగరెట్ కాలుతున్నంత వేగంగా మనిషి జీవితం కూడా కరిగిపోతుందని, భార్య పిల్లలు ఎంత పిలిచినా వారితో గడిపే సమయం తగ్గిపోతుందని బలమైన హెచ్చరిక ఇచ్చింది.
👉 వైద్య నిపుణులు చెబుతున్నదేమిటంటే –ధూమపానం
ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండెజబ్బులు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలకు దారి తీస్తుంది.ఒకరి అలవాటు మొత్తం కుటుంబాన్ని మానసిక, ఆర్థిక కష్టాల్లోకి నెట్టేస్తుంది.
🔔 మొత్తానికి:
“సిగరెట్ వల్ల నువ్వు కాలిపోతావు… నీతో పాటు నీ కుటుంబం కూడా బాధపడుతుంది” అన్న బలమైన సందేశం ఈ పోస్టర్‌తో మరోసారి గుర్తు చేసింది.
అనూష

