యర్రగొండపాలెం (ప్రకాశం జిల్లా):
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం టిడిపి కార్యాలయంలో బుధవారం త్రిపురాంతకం టిడిపి నాయకులు, కార్యకర్తలతో పార్టీ ఇన్‌ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మండల కమిటీ అధ్యక్షులను ఎన్నుకొని ప్రతిపాదించిన పేర్లను అధిష్ఠానానికి పంపిస్తామని తెలిపారు.
కష్టకాలంలో పార్టీ కోసం శ్రమించిన ప్రతి కార్యకర్తకు తప్పకుండా గుర్తింపు లభిస్తుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో త్రిపురాంతకం టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

