అమరావతి :
లిక్కర్ స్కామ్ దర్యాప్తులో భాగంగా సిట్ భారీ సోదాలు జరిపింది. సీఎం వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డికి చెందిన 10 కంపెనీలపై సిట్ దాడులు చేసింది. లిక్కర్ స్కామ్‌లో వచ్చిన ముడుపులు ఈ కంపెనీల్లోకి మళ్లినట్లు సిట్‌కు ఆధారాలు దొరికాయి.
హైదరాబాద్, చెన్నైలోని కార్యాలయాలు, కంపెనీల్లో శోధనలు కొనసాగుతున్నాయి. చెన్నైలోని తొమ్మిది కంపెనీల నుంచి సొమ్ము విదేశీ షెల్ కంపెనీలకు తరలించబడినట్టు సమాచారం లభించిందని అధికారులు వెల్లడించారు. ఈ దాడులు కేసు దర్యాప్తులో కీలక మలుపు కానున్నాయి.

