హైదరాబాద్ – హైడ్రా పరిధి
“మేడం… మా కాళ్లు మొక్కుతాం… మా ఇళ్లు కూలగొట్టకండి” అంటూ ఎమ్మార్వో ముందు కాళ్లు మొక్కుతూ విలపించిన బాధితులు. పేదల ఆర్తనాదాలు వినిపించకముందే, రేవంత్ బుల్డోజర్ సర్కార్ ఇళ్లను కూల్చివేయడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇళ్లపై పిడుగు పడ్డట్టుగా బుల్డోజర్లు నడిపిన అధికారులు… నిలువ నీడ లేకుండా వందలాది కుటుంబాలను రోడ్డుపైకి నెట్టారు. ఈ ఘటనలో కన్నీళ్లను ఆపుకోలేకపోయిన ఒక మహిళ ఆవేదనకు లోనై ఫిట్స్‌తో కుప్పకూలింది.
పండుగ రోజు పేదల ఇళ్లు కూల్చి, కన్నీళ్లు మిగిల్చిన ప్రభుత్వ వైఖరిని బాధితులు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు.
“ఇదేనా ప్రజాపాలన?.. ఇదేనా కాంగ్రెస్ పాలన?” అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

