ఆదిలాబాద్:
ఆదిలాబాద్ సుందరయ్యనగర్‌కు చెందిన ఓ యువకుడు ధని లోన్ యాప్‌లో రూ. 5 లక్షల రుణానికి దరఖాస్తు చేశాడు. లోన్ మంజూరు కావాలంటే ముందుగా నగదు చెల్లించాలని మెసేజ్ అందడంతో, బాధితుడు విడతల వారీగా ₹1,00,650 చెల్లించాడు.
కానీ లోన్ రాకపోవడంతో మోసం జరిగినట్లు గుర్తించగా, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టూటౌన్ పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారు.

