అమరావతి:
అధికారి సస్పెండ్రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్‌పై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.
సుభాష్ తన ఫేస్‌బుక్ ఖాతాలో అమరావతి ముంపు ఫోటోలు షేర్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైందే కాకుండా, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని భావించిన అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుభాష్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాజధాని అంశంపై ఇలాంటి పోస్టులు పెట్టడం తగదని, బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న అధికారులు మరింత జాగ్రత్త వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అమరావతి రాజధాని భవిష్యత్తుపై కొనసాగుతున్న చర్చల నడుమ ఈ ఘటన మరింత వివాదాస్పదంగా మారింది.

