Tv424x7
Telangana

బతుకమ్మ పండుగ చీరతో ఉరి వేసుకొని యువకుడు మృతి.. భార్యే కారణమా?

ఉరిపెద్దపల్లి, అక్టోబర్ 4:

బతుకమ్మ పండుగ ఆనందం మధ్య పెద్దపల్లి జిల్లాలో ఓ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

కాల్వ శ్రీరాంపూర్ మండలం జాపర్ ఖాన్‌పేట గ్రామానికి చెందిన జానపద కళాకారుడు గడ్డం రాజు, హైదరాబాద్‌లో నివసిస్తూ కొన్నేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు.

అయితే, భార్య చిత్రహింసలు, వేధింపులు భరించలేక రాజు బతుకమ్మ పండుగ రోజే చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇంకా షాకింగ్ అంశం ఏమిటంటే – మరణానికి ముందు రాజు ఒక సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతూ ప్రాంతమంతటా కలకలం రేపుతోంది.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.స్థానికులు మాత్రం భార్య వేధింపులే ఈ ఆత్మహత్యకు కారణమని ఆరోపిస్తున్నారు.

Related posts

AIG ఆస్పత్రికి వెళ్లిన కేసీఆర్

TV4-24X7 News

సద్గురు పేరుతో డీప్‌ఫేక్ మోసం – మహిళకు ₹3.75 కోట్లు నష్టం..

TV4-24X7 News

BHEL ఉద్యోగులు గ్రూప్-1లో మెరిసిన విజయగాథ..

TV4-24X7 News

Leave a Comment