Tv424x7
Telangana

పీఎం కిసాన్ పథకంలో అక్రమాలు – కేంద్రం రాష్ట్రాలకు గడువు

హైదరాబాద్: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకంలో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర వ్యవసాయ శాఖ తనిఖీల్లో 31.01 లక్షల అనుమానాస్పద కేసులు గుర్తించి, వారిలో 17.87 లక్షల మంది భార్యాభర్తలు ఇద్దరూ అక్రమంగా లబ్ధి పొందినట్లు తేలింది.

కేంద్రం అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అక్టోబర్ 15లోగా తనిఖీలు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

అక్రమాల రకాలు:ఒకే కుటుంబంలోని భార్యాభర్తలిద్దరూ లబ్ధి పొందడం.

మైనర్ పిల్లలు, ఇతర కుటుంబ సభ్యుల పేర్లపై డబ్బులు పొందడం.

భూమి అమ్మిన తర్వాత పాత యజమాని, కొత్త యజమాని ఇద్దరూ లబ్ధి పొందడం.

కేంద్రం భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి రైతు గుర్తింపు కార్డును తప్పనిసరిగా చేసిందీ, తదుపరి విడత నిధులను దీపావళికి విడుదల చేసే అవకాశం ఉంది.

Related posts

హాలీవుడ్ను హైదరాబాద్కు తీసుకువస్తా’ – సీఎం రేవంత్ రెడ్డి,

TV4-24X7 News

మొంథా తుఫాన్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

TV4-24X7 News

నటి రంగ సుధాపై అసభ్యకర పోస్టులు….పోలీసులకి ఫిర్యాదు..

TV4-24X7 News

Leave a Comment