మైదుకూరు నియోజకవర్గం, దువ్వూరు మండలం గుడిపాడు గ్రామంలో మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ భారీ ఎత్తున కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన సంఘం కార్యదర్శి, దువ్వూరు మండల యువ నాయకుడు తుమ్మల వెంకట్ రెడ్డి (చిన్న), గుడిపాడు సర్పంచ్ బాబు షరీఫ్, పంచాయతీ వైయస్సార్సీపీ కార్యదర్శి పోలక వీరారెడ్డి, నంద్యాల శివప్రతాపరెడ్డి, వెర్రి మస్తాన్ రెడ్డి, ఎర్రగుంట్ల మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సంతకాల సేకరణలో పెద్ద సంఖ్యలో యువత, గ్రామస్తులు పాల్గొని ప్రభుత్వ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
వారు మాట్లాడుతూ — “ప్రజా విద్యా, వైద్య రంగాలను ప్రైవేటీకరణకు గురిచేయరాదు. గుడిపాడు మెడికల్ కాలేజ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగాలని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.

