Tv424x7
Andhrapradesh

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల లాయర్ పొన్నవోలు పై కీలక వ్యాఖ్యలు

.పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన ఏమి లాయర్?… ఆయన ప్రెస్ మీట్ పెట్టీ భుజాలు తడుముకున్నారని.. ఆయిన తనపై ఊగుతూ మాట్లాడారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఆదివారం విశాఖలో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. పొన్నవోలు సుధాకర్ రెడ్డి మధ్య క్విడ్ ప్రోకో జరిగిందని ఆరోపించారు. వైఎస్‌ఆర్ అంటే అభిమానం, గౌరవం ఉందని చెప్పిన పొన్నవోలు సుధాకర్ వైఎస్‌ఆర్ పేరును ఎఫ్‌ఐఆర్ (FIR)లో‌ చేర్చాలని అన్ని కోర్టుల చుట్టూ ఎందుకు తిరిగారని ప్రశ్నించారు.రాజశేఖర్ రెడ్డి పేరు చేర్చినందుకు పొన్నవోలుకు అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ పదవి జగన్ ఇచ్చారని షర్మిల ఆరోపించారు. జగన్ ఆదేశాలు మేరకే.. పొన్నవోలు అలా చేశారని అన్నారు. అత్యంత మేలు చేశారు కనుక జగన్ సిఎం అయిన వారంలోగా ఏఏజీ పదవి బహుమతిగా ఇచ్చారన్నారు. పొన్నవోలుకు టాలెంట్ ఎక్కడ ఉంది, స్వామి భక్తికి మెచ్చే ఆయనకు పదవి కట్టబెట్టారన్నారు. ఈ అంశాలు నాకు ముందు తెలియదని.. ఈ మధ్య ఉండవల్లి అరుణ్ కుమార్ కలిసినప్పుడు ఆయనే ఈ సీబీఐ కేసులో వైఎస్ ఆర్ పేరు పెట్టిన అంశం చెప్పారని షర్మిల తెలిపారు.రాజశేఖర్ రెడ్డి రాయలసీమ పరిస్థితులు మార్చారని, వారి తండ్రిని చంపిన వారిని కూడా క్షమించి విడిచిపెట్టారని.. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని షర్మిల మండిపడ్డారు. హత్యలు చేసిన వారికే పదవులు ఇస్తున్నారని ఆరోపించారు. వివేక హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి చిన్నపిల్లాడు కాదని.. సీబీఐ బయట పెట్టిన అంశాలు బట్టి మేము మాట్లాడుతున్నామన్నారు. జేడీ లక్ష్మీనారాయణ అప్పుడు మాటలకు ..ఇప్పుడు మాటలకు చాలా తేడా ఉందన్నారు. జేడీ ప్రస్తుతం ఒక పార్టీ అధినేత..కనుక ఆయన వ్యాఖ్యలు రాజకీయ నేపథ్యంలో ఉంటాయని షర్మిల వ్యాఖ్యానించారు.

Related posts

టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్

TV4-24X7 News

మద్యం అక్రమాలపై సీఐడీ విచారణ: కొల్లు రవీంద్ర

TV4-24X7 News

యూరియాపై మండలిలో వాగ్వాదం!!

TV4-24X7 News

Leave a Comment