Tv424x7
Andhrapradesh

ఏపీలో అల్లర్లపై సిద్ధమైన సిట్ ప్రాథమిక నివేదిక

అమరావతి: ఏపీలో ఎన్నికల సమయంలో అల్లర్లపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. క్షేత్ర స్థాయిలో విచారించి నివేదికను సిద్ధం చేసిన నివేదికను ఉదయం 10 గంటలకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ డీజీపీకి అందించనున్నారు..మధ్యాహ్నానికి సీఎస్ ద్వారా సీఈఓ, సీఈసీకి ప్రాథమిక నివేదిక అందనుంది. పూర్తి స్థాయి నివేదిక ఇచ్చేందుకు సిట్ కొంచెం గడువు కోరనుంది. రెండు రోజులపాటు మూడు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో బాధితులు, రాజకీయ నేతలు, స్థానికులు, పోలీసులను సిట్ బృందాలు విచారించాయి. ఘటనా స్థలంలో దొరికిన ఆయుధాలు, అల్లర్లకు కారణమైన వారిని గుర్తింపు, సీసీ కెమెరాలు పరిశీలన, వారిపై నమోదైన కేసులను సైతం పరిశీలించాయి. పోలీసు ఉన్నతాధికారుల నిర్లక్ష్యం,ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే అల్లర్లు జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు..

Related posts

తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించిన పుట్టా సుధాకర్

TV4-24X7 News

ఎన్నికలకు యువ సైన్యాన్ని ఏర్పాటు చేసిన జగన్…ఇదే ఆ యువ సైన్యం

TV4-24X7 News

అవసరమైతే ప్రభుత్వంపై పోరాటం చేస్తా:

TV4-24X7 News

Leave a Comment