ఆదోని డివిజన్లో ఆంధ్రప్రదేశ్ డెమొక్రటిక్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మగ్దుంబాష ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆదోని జిల్లాగా రూపకల్పన చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ సబ్ కలెక్టర్ గారికి మెమొరాండం సమర్పించారు. జర్నలిస్టులు మాట్లాడుతూ ఆదోనికి జిల్లాగా ఏర్పాటైతే అభివృద్ధి అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.
స్థానిక ప్రజల సౌకర్యార్థం జిల్లాగా చేయాలని, ఈ మేరకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

