తిరుమలలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మాడ వీధుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఈవోతో కలిసి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు తొమ్మిది రోజుల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ భారీ ఏర్పాట్లు చేపట్టింది.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఛైర్మన్ తెలిపారు. వచ్చే పది రోజుల్లో మిగిలిన పనులను పూర్తి చేస్తామని, భక్తుల సౌకర్యార్థం ఎల్‌ఈడీ స్క్రీన్లు, ప్రత్యేక విద్యుత్ అలంకరణలు, పుష్పాలంకరణలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు.

