హైదరాబాద్:
ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. ఆరోగ్యశ్రీ సేవలు యథాతథంగా కొనసాగాలని కోరుతూ, “మేం ఇచ్చిన లిబర్టీని గౌరవించాలి. గత తొమ్మిదిన్నర ఏళ్లలో చేయని బంద్ ఇప్పుడు ఎందుకు చేయాల్సి వస్తుంది?” అని ప్రశ్నించారు.
మంత్రి మాట్లాడుతూ, “గత ప్రభుత్వంలో నెలకు రూ.50 కోట్లు కూడా రిలీజ్ అవ్వలేదు. కానీ మేం మాత్రం నెలకు రూ.
100 కోట్లు ఇవ్వడానికి కమిట్‌మెంట్ ఇచ్చాం. ప్రజలకు ఆరోగ్యశ్రీ సేవలో ఎలాంటి అంతరాయం కలగదు” అని స్పష్టం చేశారు.
ప్రజలకు ఆరోగ్యశ్రీ సేవలు నిరంతరం అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

