హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టుబడింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు 3.38 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఐరన్ బాక్స్‌లో బంగారం దాచిపెట్టుకొని తెచ్చిన నిందితులను అధికారులు పట్టుకున్నారు.
ఈ క్రమంలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. బంగారం విలువ కోట్లు దాటుతుందని అంచనా. అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా ఈ ఘటన వెనుక ఉన్నట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు.
🔎 నిందితులపై కేసు నమోదు చేసి, మరింత విచారణ చేపడుతున్నారు.

