సుపరి పాలన కార్యక్రమంలో భాగంగా కొత్తగూడ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఇమ్మడి రాజ్‌కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సల్యూట్ స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొని దేశభక్తి నినాదాలతో ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఎస్ఐ రాజ్‌కుమార్ మాట్లాడుతూ – “జాతీయ జెండా మన గౌరవానికి, ఐక్యతకు ప్రతీక. సుపరి పాలనలో ప్రతి ఒక్కరు చట్టాన్ని గౌరవించి సమాజ అభివృద్ధికి తోడ్పడాలి” అని అన్నారు.
పోలీస్ అధికారులు, సిబ్బంది కలిసి జాతీయ గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ముగించారు.

