Tv424x7
Andhrapradesh

విశాఖ గీతం వైద్య కళాశాలలో దారుణం!!


విశాఖపట్నం గీతం వైద్య కళాశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. కాలేజీ భవనం పై అంతస్తు నుండి దూకి మెడికల్ విద్యార్థి విస్మాద్‌ సింగ్‌ (20) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతుడు హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. ఈ ఘటనతో కళాశాల పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

గమనించదగ్గ విషయం ఏమిటంటే, కొన్ని రోజుల క్రితం కూడా ఇదే గీతం విద్యాసంస్థలో ఓ విద్యార్థిని అనుమానాస్పద మృతిచెందిన ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపింది. వరుసగా విద్యార్థుల మృతులు సంభవించడం విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోంది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

Related posts

గడివేములలో పిచికారీ డ్రోన్స్ ప్రారంభం!!

TV4-24X7 News

సూరాడ రాజు ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం

TV4-24X7 News

మైదుకూరు లో ఘనంగా గణంత్ర దినోత్సవ వేడుకలు

TV4-24X7 News

Leave a Comment