Tv424x7
Telangana

ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది దుర్మరణం

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.హైదరాబాద్‌–బీజాపూర్‌ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. టిప్పర్‌ మితిమీరిన వేగంతో రావడం వల్ల ఢీకొట్టిన వెంటనే కంకర బస్సుపై పడటంతో ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. జేసీబీ సాయంతో వారిని బయటకు తీశారు.దుర్ఘటనలో ఇద్దరు డ్రైవర్లు సహా 20 మంది మృతి చెందారు. మృతుల్లో 11 మంది మహిళలు, 15 నెలల పసిపాప కూడా ఉన్నట్లు సమాచారం. తల్లి, బిడ్డ మృతదేహాలు రోడ్డుపై పడి ఉండటం హృదయ విదారకంగా మారింది.గాయపడిన వారిని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలంలో ప్రయాణికుల ఆర్తనాదాలు, కంకర కుప్పలు భయానక దృశ్యాన్ని తలపించాయి. సహాయక చర్యలు కొనసాగుతుండగా, చేవెళ్ల సీఐ శ్రీధర్ రక్షణ పనుల్లో పాల్గొనే సమయంలో జేసీబీ కాలి పై నుంచి వెళ్లి గాయపడ్డారు.ప్రమాదానికి కారణం టిప్పర్ వేగమేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related posts

యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు…

TV4-24X7 News

డీజీపీ అంజనీకుమార్ సస్పెండ్

TV4-24X7 News

రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం

TV4-24X7 News

Leave a Comment