Tv424x7
Andhrapradesh

కీసరలో 50 కోట్ల భూమి కబ్జా ప్రయత్నం సంచలనం

మేడ్చల్ జిల్లా

కీసర పీఎస్ పరిధిలో భూమి కబ్జా వివాదం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. రాంపల్లిలో 1999లో సర్వే నెంబర్ 385లో రెండు ఎకరాల భూమి కొనుగోలు చేసిన ఓ ఎన్‌ఆర్‌ఐ మహిళకు ఇప్పుడు ఇబ్బందులు మొదలయ్యాయి. కాంపౌండ్‌ వాల్‌, గది, ఎలక్ట్రిక్ మీటర్, LRS అన్నీ తన పేరుపై ఉండగానే భూమిని కబ్జా చేయాలని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి ప్రణాళిక రచించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఆయన సన్నిహితుడైన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి విషయం తీసుకెళ్లి, లోకల్ వ్యక్తి సుబ్బారెడ్డిని రంగంలోకి దించారు. కీసర ఎమ్మార్వోకు ఫోన్ చేసి సహకరించాలని, రాచకొండ పోలీసులకు జోక్యం చేసుకోవద్దని సూచించినట్టు సమాచారం. అనంతరం సుబ్బారెడ్డి, తన అనుచరులతో కలిసి కాంపౌండ్ వాల్‌ను కూల్చి, ఇది సర్వే నెంబర్ 386 భూమి అంటూ వాదించారు.

అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నా భూమిని కబ్జా చేశారని ఆ ఎన్‌ఆర్‌ఐ మహిళ వాపోయారు. తన భూమి తిరిగి తనకే దక్కేలా న్యాయం చేయాలని ఆమె వేడుకుంటున్నారు.

Related posts

ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు

TV4-24X7 News

భూమన కరుణాకర్ రెడ్డి పై కేసు నమోదు

TV4-24X7 News

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏడు సీట్లలో టీడీపీ అభ్యర్థులు ఖరారు

TV4-24X7 News

Leave a Comment